3, ఏప్రిల్ 2012, మంగళవారం

జ్ఞాపకమే!

మొదటిసారి మన మధ్య మాట కలిసి స్నేహం కుదిరిన చోటు జ్ఞాపకమే!
మోమాటంతో
ఆలోచించి ఆచితూచి పొదుపుగా నువ్వాడిన మాటలు జ్ఞాపకమే!
నీ స్నేహంలోని స్వచ్ఛతకి
నా పెదవులపై విరిసిన మల్లెల నవ్వులు జ్ఞాపకమే!
నే చెప్పే కబుర్లు శ్రద్ధగా
వింటూ మౌనంగా కళ్ళతోనే నవ్విన క్షణాలు జ్ఞాపకమే!
నీ మాటల్లో పదే పదే తొంగి చూసే
అద్దం లాంటి నీ మనసు జ్ఞాపకమే!
నీ గుండెల్లో దాగున్న ఆపేక్షనంతా అక్షరాల్లో
నింపి నా దోసిట్లో ఒంపిన రోజు జ్ఞాపకమే!
నను కళ్ళెత్తి సూటిగా చూడనివ్వని నీ
చురుకైన చూపులు జ్ఞాపకమే!
మౌనంగా ఊసుల్ని పంచుతూ నా చూపుని కట్టి పడేసే నీ
అరనవ్వు జ్ఞాపకమే!
నీ పక్కన నడుస్తున్నప్పుడు తొలిసారి నా గుండె లయ తప్పిన
అనుభవం జ్ఞాపకమే!
నా అరచేతిలో వెచ్చగా ఒదిగిపోయి నను మురిపించిన నీ చేతి స్పర్శ
జ్ఞాపకమే! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి