23, జనవరి 2012, సోమవారం

కలిసే ప్రతి సంధ్యలో


కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో (2)
నాట్యాలన్నీ కరగాలి
నీలో నేనే మిగలాలి (2)
కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి (2)
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి
ఒణికే అధరం పిలవాలి
కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

మేనితోనే ఆగుతాయి ముద్రలు
గుండె దాకా సాగుతాయి ముద్దులు (2)
ఇంత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి
పరువం తీరం చేరాలి
క�  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి