11, సెప్టెంబర్ 2012, మంగళవారం


ఈ మద్య కాలం లో మనం తరచుగా వింటున్న మాట నిజమైన ప్రేమ కనిపించట్లేదు దొరకట్లేదు అని....
అదేమన్న వస్తువా ?  వెతికి పట్టుకోవటానికి.... కాదు కదా...
నిజంగా మనం కొంత  మంది ప్రేమికులను చూస్తే  ఇది కూడా ప్రేమేనా అనే దేహం కలగక మానదు...
అది వారికి (ఆ ప్రేమికులకి)బాగానే ఉండొచ్చు కాని మనకే నచ్చక  
పోవచ్చు.... 
ఇలాంటి ప్రేమలు మనకెన్నో కన్పిస్తూనే ఉంటాయి కదా...
ప్రేమంటే మనసుకి ముసుగులు తొడిగి మురిసిపోవటం కాదు...
నిజమైన  ప్రేమంటే మనం పొందే ప్రేమలో నిజాయితి ఎంత ఉందో 
గ్రహించటమే....
మనం ఎలా ఉన్న మనల్ని ఇష్టపడే కన్నవారి ప్రేమ,
నీలోని మంచితోపాటు చెడుని కూడా స్వీకరించే 
స్నేహితుడి  ప్రేమ
నువ్వెలా ఉన్న, నువ్వు మారినా కూడా తను మారకుండా నిన్ను నిన్నుగా ప్రేమించే వారి ప్రేమ...
మనకు ఇష్టమైన వారు ఎంత దూరంగా ఉన్న వారి పైన 
ఇంచుక కూడా మారని మునుపటి ప్రేమ...
 ఇదే నిజమైన ప్రేమ..
ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది కాని, నిజమైన ప్రేమ కొన్ని 
సార్లే పుడుతుంది...
వర్షం ఎప్పుడు పడుతుంది కాని  వడగండ్ల వాన కొన్ని 
సార్లే పడుతుంది 
ఒడిసి పట్టుకోవటానికి సిద్దంగా ఉండు వడగండ్లని, 
నిజమైన ప్రేమని కూడా....

29, జూన్ 2012, శుక్రవారం

7, జూన్ 2012, గురువారం

కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి



కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై
అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై
అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టివచ్చే దొరసాని
మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //

చరణం 1: ఎండల్లకన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగేవేలా నదిలా
తానే సాగేవేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //

చరణం 2: మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు..
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చెశావు..
మెరుపల్లే కలిశావు.... మైమరపే ఇచ్చావు..
నీలొనె కలిపావు....

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..

ఎటు చూసిన ఏం చెసినా... ఎ దారిలో అడుగేసినా...
నలువైపులా నాకెదురై ఉందా మైనా మైనా..
ఏ మబ్బులొ దొగాడినా ఎ హాయిలొ తేలాడిన నాకింతగా అనందం ఉందా నిన్నా మొన్నా...
ఎవ్వరికైన ఏ ఎద కైనా ప్రెమలో పడితె ఇంతేగా....
అవుననుకున్నా కాదనుకున్నా...
అనుకొనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతుందిగా..

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..

దేవతా..దేవత..దేవత..దేవతా..అది నా దేవతా..
దేవత..దేవత..దేవతా

చెలి చూపులొ చిరు గాయమై
మలి చూపులొ మటు మాయమై
తొలి ప్రేమగా నే మొదలవుతున్న కలలె కన్నా..
నా శ్వాసలొ తను లీనమై. నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చెలి కొసమే అన్నా ఎవరేమన్నా..

ఎక్కడె నేను ఎక్కడున్నానూ చాలా దూరం నడిచాను..
తీయని దిగులై పడి ఉన్నాను చెలి లేనిదె బతికేదెలా ఎ ఊపిరైన (ఉత్తి గాలిలే)..

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు..
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చెశావు..
మెరుపల్లే కలిశావు.... మైమరపే ఇచ్చావు..
నీలొనె కలిపావు....

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా..నా చిత్రం చిత్రించెయినా..
కనుపాపైపోనా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే

కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండీ అన్నీ మరిచా
హో నీలో నిండీ అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నీ గుందె చప్పుడులోనా
నా ప్రాణం నింపానమ్మా..నిను చేరానమ్మా !

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా

మన్మధుడా నీ కల కన్నా

మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక
నిన్ను కన్న తొలినాడే దేహం కదలక
ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే
ఎందరినో నే చూసాకాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగా ఎపుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు (2)


మన్మధుడా నీ కల కన్నా మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా
మగువగా పుట్టినా జన్మఫలితమీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా మనసు గెలిచి నా తోడు కలిసీ
యదలలోన ఊయలలుగే అందగాడు ఇతడంతా
యదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంటా
ఐనా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే
సుఖమై యద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇదియేం చరిత్రమో
మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రాణము గా
మన్మధుడే నా ప్రణయమని మన్మధుడే నాకిష్టమని
చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం సిగ్గులే మరువనా
నా పడకటింటికి నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా (2)

ఎన్నెన్నో జన్మల బంధం నీది .. నాది



ఎన్నెన్నో జన్మల బంధం నీది .. నాది
ఎన్నటికి మాయని మమత నాది .. నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ||ఎన్నెన్నో||

పున్నమి వెన్నెలలోన .. పొంగులు కడలి
నిన్నే చూసిన వేళ నిందులు చెలిమి
నువ్వు కదలివయితె నేను అతిగా మరి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా ..
చేరనా ... చేరనా .. ||ఎన్నెన్నో||


కోటి జన్మలకయినా .. కోరేదొక్కటే
నాలో సగమై ఎప్పుడు .. నేనుండాలి
నీవున్న వేళ .. ఆ స్వర్గమేలా ..
ఈ పొందు ఏల్లవేలాలందు ఉందని ..
ఉందని .. ఉందని .